స్వరాష్ట్రంలో పర్యాటక వికాసం
తెలంగాణ కోటి రతనాల వీణ. దకన్ పీఠభూమిపై కొలువైన ఈ పుణ్యభూమి ప్రకృతి రమణీయతతోపాటు సహజ జలవనరులు, కొండలు, కోనలు, కోటలు, ఆధ్యాత్మిక సౌరభాలకు నిలయం.
- తెలంగాణకు టూరిస్టుల తాకిడి
- ఎనిమిదేండ్లలో 65 కోట్ల మంది రాక
హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ కోటి రతనాల వీణ. దకన్ పీఠభూమిపై కొలువైన ఈ పుణ్యభూమి ప్రకృతి రమణీయతతోపాటు సహజ జలవనరులు, కొండలు, కోనలు, కోటలు, ఆధ్యాత్మిక సౌరభాలకు నిలయం. ఇన్ని ప్రత్యేకతలున్న తెలంగాణ పర్యాటక రంగం ఉమ్మడి పాలనలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. కనీసం ప్రచారానికి కూడా నోచుకోలేదు. కానీ, స్వరాష్ట్ర ఏర్పాటుతో తెలంగాణ పర్యాటక రంగం నూతన జవసత్వాలను సంతరించుకొని వికసిస్తున్నది. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, సహజ వనరులు, అభివృద్ధి పట్ల సంపూర్ణ అవగాహన ఉన్న సీఎం కేసీఆర్.. తెలంగాణను టూరి జం డెస్టినేషన్గా తీర్చిదిద్దుతున్నారు. ఈ చర్యలతో పోచంపల్లికి ఉత్తమ పర్యాటక గ్రామంగా ప్రపంచ పర్యాటక సంస్థ నుంచి గుర్తింపు లభించింది.
దీంతో రాష్ర్టానికి దేశ, విదేశ పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. రాష్ట్ర పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి, తగిన ప్రాచుర్యాన్ని కల్పించాలన్న సీఎం కేసీఆర్ దిశానిర్దేశం మేరకు తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీఎస్టీడీసీ)ని నోడల్ ఏజెన్సీగా ఏర్పాటు చేశారు. ఈ సంస్థ రాష్ట్రవ్యాప్తం గా 54 గ్రీన్ టూరిజం హోటళ్లను నెలకొల్పి పర్యాటకులకు అద్భుత వసతులను కల్పిస్తున్నది. 31 టూరిజం బస్సులతోపాటు 120 బోట్లను నడుపుతున్నది. గోలొండ, వరంగల్ కోట వద్ద సౌండ్ అండ్ లైట్ షోలను నిర్వహిస్తున్నది. ఈ కోటలకు సంబంధించిన చారిత్రక విశేషాలను తెలియజేసే కధనాలను తెలుగుతోపాటు హిందీ, ఇంగ్లిష్లో ప్రదర్శింపజేస్తున్నది. దీంతో తెలంగాణ పట్ల ఇప్పటికే దేశ, విదేశ పర్యాటకుల్లో ఆసక్తి విపరీతంగా పెరిగింది. ఫలితంగా 2014 నుంచి ఈ ఏడాది జూలై వరకు 63.51 కోట్ల మంది దేశీయ పర్యాటకులు, 1.35 లక్షల మంది విదేశీ పర్యాటకులు తెలంగాణను సందర్శించారు.
రాష్ట్రంలో పర్యాటకాభివృద్ధి, వసతుల కల్పనకు చేపట్టిన చర్యలు
- నాగార్జునసాగర్ వద్ద రూ.65 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్ అభివృద్ధి.
- మేడారంలో రూ.13.43 కోట్లతో పర్యాటక వసతుల అభివృద్ధి.
- లక్నవరం వద్ద రూ.27.65 కోట్లతో అదనపు వసతుల ఏర్పాటు.
- తాడ్వాయిలో రూ.9.36 కోట్లతో పర్యాటక కేంద్రం అభివృద్ధి.
- గట్టమ్మ గుట్ట వద్ద రూ.7.36 కోట్లతో అభివృద్ధి పనులు.
- మల్లూరు వద్ద వసతుల కల్పనకు రూ.4.20 కోట్లు వ్యయం.
- బొగత జలపాతాల వద్ద రూ.11.64 కోట్ల ఖర్చు.
- సోమశిల రిజర్వాయర్ వద్ద రూ.20.87 కోట్లు వ్యయం.
- సింగోటం రిజర్వాయర్ వద్ద రూ.7.84 కోట్లతో పర్యాటక కేంద్రం అభివృద్ధి.
- శ్రీశైలం ఈగలపెంట వద్ద రూ.25.96 కోట్ల పనులు.
- ఫర్హాబాద్ మన్ననూరు వద్ద రూ.13.81 కోట్ల వ్యయం.
- మల్లెల తీర్థం వద్ద రూ.5.35 కోట్లతో పనులు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

