హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తే తెలంగాణ): శ్రీలంక ప్రధాని దినేశ్ గుణవర్ధనేతో పర్యాటకశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ భేటీ అయ్యారు. రాష్ట్రంలో బౌద్ధమతం పూర్వవైభవానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషిని దినేశ్ గుణవర్ధనేకు మంత్రి వివరించారు. బుద్ధుడు జీవించిన కాలం నుంచే తెలంగాణలో బుద్ధి జం వ్యాప్తి చెందిందని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక బౌద్ధ కేంద్రాలు కోటిలింగాల, బా దంకుర్తి, ఫణిగిరి, నాగార్జునకొండ, నేలకొండపల్లిలాంటి పురాతన బౌద్ధ క్షేత్రాలను పరిరక్షించటంతోపాటు పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నట్టు వెల్లడించారు. టెంపుల్ టూరిజం, మెడికల్ టూరిజం, ఇండస్ట్రియల్ పాలసీ, ఇరిగేష న్ సిస్టం అభివృద్ధికి, వ్యవసాయ అభివృద్ధికి సీఎం కేసీఆర్ చేపట్టిన కృషిని మంత్రి వివరించారు.
ఆచార్య నాగార్జునుడు నడియాడిన నాగార్జునసాగర్‌లో 200 ఎకరాల్లో రూ.100 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్టును నిర్మించినట్టు గుర్తు చేశారు. బౌద్ధ ఆధ్యాత్మిక పర్యాటకుల కోసం శ్రీలంక నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు రోజువారీగా విమానాలు నడపాలని గుణవర్ధనేకు విజ్ఞప్తి చేశారు. శ్రీలంక-తెలంగాణ మధ్య బౌద్ధ ఆధ్యాత్మిక, సాంసృతిక, బౌద్ధ ఆధ్యాత్మిక సత్సంబంధాలు మెరుగుపరచటంపై సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ చరిత్రపై సింహాళ భాషలో తన కోడలు రాసిన పుస్తకాన్ని త్వరలో తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో విడుదల చేస్తామని గుణవర్ధనే తెలిపారు. ఈ సమావేశంలో శ్రీలంక ఎంపీ యాదమిని గుణవర్ధనే, ఆ దేశ ప్రభుత్వ కార్యదర్శి సుగేశ్వర్, పార్లమెంటు వ్యవహారాల సెక్రటరీ కురుప్పు, లైట్ ఆఫ్ ఏషియా వ్యవస్థాపకుడు నవీన్ గుణవర్ధనే, బుద్ధుడి బయోపిక్‌లో బుద్ధుడి పాత్రలో నటిస్తున్న గగన్ మాలిక్ తదితరులు పాల్గొన్నారు.