హైదరాబాద్, జూలై 19 (నమస్తే తెలంగాణ) : ఎప్సెట్ ప్రవేశ పరీక్షలో టాపర్లుగా నిలిచిన ప్రతిభావంతులు రాష్ట్రంలో చదవడంలేదు. మన రాష్ట్రంలో అడ్మిషన్లు పొందేందుకు ఇష్టపడటంలేదు. అత్యధికులు వలసపోతున్నారు. మన రాష్ట్రం వదిలి ఇతర రాష్ర్టాలకు చలో అంటున్నారు. ఎప్సెట్ టాప్-100 ర్యాంకర్లలో కేవలం ముగ్గురు మాత్రమే మన రాష్ట్రంలో అడ్మిషన్ పొందారు. 97 మంది ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లారు. వీరిలో కొందరు జేఈఈలోనూ మంచి ర్యాంకు సాధించి ఐఐటీల్లో ప్రవేశాలు పొందారు. ఎప్సెట్ తొలి విడత సీట్లను శుక్రవారం కేటాయించారు. అయితే ఐదువేల లోపు ర్యాంకర్లలో అత్యధికలు ఐఐటీలు, ఎన్ఐటీల్లో సీట్లు పొందారు. ఐదువేల ర్యాంకు తర్వాతి ర్యాంకర్లు మాత్రమే రాష్ట్రంలో అడ్మిషన్లు పొందారు. ఈ సారి మొత్తంగా 77,561 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ 77వేలకు పైగా సీట్లలో 20వేల నుంచి చివరి ర్యాంకు వరకు గల 46,101 మంది విద్యార్థులు సీట్లు దక్కించుకుని, మన రాష్ట్రంలో ప్రవేశాలు పొందారు.
ర్యాంకర్ల వారీగా వివరాలు..