హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): సీతారామ లిఫ్టు ఇరిగేషన్ ప్రాజెక్టులోని మూడు పంపులను 15న ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని జలసౌధలో మంగళవా రం మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. 2026 ఆగస్టు 15 నాటికి ప్రాజెక్టును పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై రూ.500 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు చేసిందని రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.
మీ ఫ్యాన్లు మాకొద్దు బీఆర్ఎస్ విరాళాన్ని నిరాకరించిన ప్రిన్సిపాల్
గంగాధర, ఆగస్టు 13: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో గల మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలకు బీఆర్ఎస్ నాయకులు విరాళంగా ఇచ్చిన 8 ఫ్యాన్లను ప్రిన్సిపాల్ నిరాకరించారు. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ రెండు రోజుల క్రితం గురుకుల పాఠశాలను సందర్శించగా.. ఫ్యాన్లు లేక ఇబ్బందులు పడుతున్నట్టు విద్యార్థులు తెలిపారు. దీంతో మంగళవారం 8 ఫ్యాన్లను స్థానిక బీఆర్ఎస్ నాయకులతో పంపించారు. వారు తెచ్చిన ఫ్యాన్లును పాఠశాల ప్రిన్సిపాల్ మంజుల తీసుకోవడానికి నిరాకరించారు.