హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : గోషామహల్ పోలీస్ స్టేడియంలో ఈనెల 21న పోలీస్ అమరవీరుల సంస్మరణదినం నిర్వహించనున్నట్టు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ బీ శివధర్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి హాజరై ప్రసంగించనున్నట్టు వెల్లడించారు. 21న అన్ని జిల్లాల పోలీస్ కార్యాలయాలతోపాటు 31వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా 191 మంది పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించారని వెల్లడించారు. పోలీస్ సిబ్బంది ధైర్యసాహసాలను వివరించే బుక్‌లెట్‌ను సురక్ష ప్రచురిస్తుందని, ఈ బుక్లెట్ వారి అంకితభావానికి నివాళిగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.