హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): వానకాలం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటుచేసినట్టు సివిల్ సప్లయ్ కార్పొరేషన్ మంగళవారం వెల్లండింది. రైతులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు 1800 4250 0333, (040–23336112, 113, 114, 115, 116,) 1967 నంబర్లలో సంప్రదించాలని సూచించింది. ఆ శాఖ ప్రధాన కార్యాలయం నుంచి దీనిని నిర్వహించనున్నారు.