కుభీర్, జూన్ 5 : నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో జొన్నల కొనుగోళ్లకు టోకెన్లను శనివారం ఉదయం నుంచి పంపిణీ చేస్తామని అధికారులు ప్రకటించడంతో వందలాది మంది రైతులు శుక్రవారం రాత్రి నుంచే ఐకేపీ కార్యాలయానికి చేరుకొని బారులు తీరారు. కార్యాలయ ఆవరణలో చీకటిలో బండరాళ్లు క్యూలో పెట్టి అక్కడే ఇరువైపులా పడుకున్నారు. కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌కు మద్దత ధర రూ.3,700 కాగా ప్రైవేట్ వ్యాపారులు మాత్రం రూ.2,200 కొంటున్నారని, అందుకే టోకెన్ల కోసం తిప్పలు పడుతున్నామని రైతులు తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇలాంటి కష్టం రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నదని పలువురు ఆగ్రహం వ్యక్తంచేశారు.