హైదరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ) : గ్రూప్-1 దరఖాస్తు గడువు ఈ నెల 4న ముగియనున్నది. రాత్రి 11:59 గంటల వరకు అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. శుక్రవారం నాటికి 3,63,974 మంది అభ్యర్థులు గ్రూప్-1కు దరఖాస్తు చేశారు. కొత్తగా 1,90,163 మంది అభ్యర్థులు ఓటీఆర్ నమోదు చేసుకొన్నారు. 3,83,319 మంది ఓటీఆర్ను ఎడిట్ చేసుకొన్నారు