హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): పౌరసంబంధాలశాఖ, తెలంగాణ మీడియా అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ నాంపల్లి తెలంగాణ మీడియా అకాడమీ ఆడిటోరియంలో నేషనల్ ప్రెస్డే నిర్వహించనున్నారు. ప్రెస్‌కౌన్సిల్ ఆఫ్ ఇండియా పని చేయడం ప్రారంభించిన రోజును నేషనల్ ప్రెస్ డేగా జరుపుకుంటారు.
1956లో ఏర్పాటు చేసిన ఈ సంస్థ.. దేశంలో పత్రికా స్వాతంత్య్రాన్ని, జర్నలిజంలో వృత్తిపరమైన నైతికతను కాపాడేందుకు కృషి చేస్తున్నది. సమాచార, పౌరసంబంధాలశాఖ ఉన్నతాధికారులు, ప్రముఖ సంపాదకుడు దేవులపల్లి అమర్, మీడియా ప్రముఖులు హాజరుకానున్నారు.