హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పాలిటెక్నిక్) కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్ ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదలకానున్నాయి.
ఈ నెల 13న పాలిసెట్ నిర్వహించారు. 98,858 మంది హాజరయ్యారు. ఎంపీసీ, ఎంబైపీసీ కోర్సులవారీగా ఫలితాలు విడుదల చేస్తారు.