సిద్దిపేట రూరల్, నవంబర్ 29: సిద్దిపేట జిల్లా చింతమడకలోని 13వ పోలింగ్ కేంద్రం లో ఓటు హక్కు వేసేందుకు సీఎం కేసీఆర్ గురువారం గ్రామానికి రానున్నారు. సీఎంఆయన సతీమణి శోభ సైతం ఇక్కడే ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బుధవారం సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత గ్రామానికి చేరుకొని ఏర్పాట్లను పరిశీలించారు.
హెలిప్యాడ్, పోలింగ్ కేంద్రం వద్ద పోలీస్ బందోబస్తుపై సీపీ తగిన ఆదేశాలు ఇచ్చారు.