ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 14, 2020 , 10:45:01

ప్ర‌పంచంలో కేటీఆర్‌కు ఇష్ట‌మైన వ్య‌క్తులెవ‌రో తెలుసా?

ప్ర‌పంచంలో కేటీఆర్‌కు ఇష్ట‌మైన వ్య‌క్తులెవ‌రో తెలుసా?

హైద‌రాబాద్ : రాష్ర్ట ఐటీ, పుర‌పాల‌క‌శాఖ మంత్రి కేటీఆర్‌కు ఈ ప్రపంచంలోనే అత్యంత ఇష్ట‌మైన వ్య‌క్తులెవ‌రో తెలుసా?. ఇంకెవ‌రు పిల్ల‌లు. ఈ విష‌యాన్ని త‌నే ట్విట్ట‌ర్ ద్వారా స్వ‌యంగా వెల్ల‌డించారు. నేటి బాల‌ల దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మంత్రి చిన్నారులంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మొత్తం ప్ర‌పంచంలో త‌న‌కిష్ట‌మైన వ్య‌క్తులు పిల్ల‌ల‌న్నారు. న‌వ్వుతున్న క‌ళ్ల‌తో న‌వ్వుతున్న ముఖాలు అంటూ ప‌లు ఫోటోల‌ను షేర్ చేశారు.

క్షేత్ర‌స్థాయి ప‌ర్య‌ట‌న‌ల్లో మంత్రి కేటీఆర్ చిన్నారులు, బాల‌బాలిక‌లతో క‌లిసిపోతూ వారిని అల‌రిస్తుంటున్న సంగ‌తి తెలిసిందే. వారిని అప్యాయంగా ప‌ల‌క‌రిస్తూ, క‌ర‌చాల‌నాల‌ను అందిస్తూ, వారితో ఫోటోలు దిగుతుండ‌టం మ‌నం చూస్తున్న‌దే. అదేవిధంగా ఆప‌ద‌లో ఉన్న నిరుపేద‌ చిన్నారుల వైద్య చికిత్స‌ల‌కు త‌క్ష‌ణం స్పందిస్తూ సాయం అందేలా చూస్తుంటారు. ఓ సినీ క‌వి అన్న‌ట్లు పిల్ల‌లు దేవుడు చ‌ల్ల‌నివారే.. క‌ల్ల‌క‌ప‌ట‌మెరుగ‌ని క‌రుణామ‌యులే.. తీరికలేని బీజీ లైఫ్‌లో కాసేపు చిన్నారుల‌తో గ‌డిపే ఆ క్ష‌ణాలు మ‌న‌సుకు ఎంతో హాయిని క‌లిగిస్తుంటాయి.