హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : తమ హక్కుల పరిరక్షణ, న్యాయమైన డిమాండ్ల సాధనకు జరిపిన 55రోజుల జనుల సమ్మె 32మంది కార్మికుల ఆత్మబలిదానం తో ముగిసిందని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ థామస్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని ఆర్టీసీ జాక్ కార్యాలయంలో కన్వీనర్ మౌలానా, కో కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, యాదగిరితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఐక్యపోరాటానికి నాంది పలికిన(అక్టోబర్ 5న) రోజుకు ఐదేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ అమరవీరుల సంస్మరణ దినంగా పాటించాలని కోరారు. అన్ని యూనిట్లలో అమరవీరులకు నివాళులర్పించాలని పిలుపునిచ్చారు.