Ramineni Srinivasa Rao | తెలంగాణ ఉద్యమకారుడు, టీఎన్జీవో ట్రెజరర్, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న రామినేని శ్రీనివాసరావు (60) అలియాస్ బొట్టు శ్రీను కన్నుమూశారు. నెల క్రితం బ్రెయిన్ స్ట్రోక్‌కు గురైన ఆయన.. కంచన్‌బాగ్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కోమాలో ఉన్న శ్రీనివాసరావు ఆదివారం మరణించారు. ఈ విషయాన్ని వైద్యులు ధ్రువీకరించారు.
తెలంగాణలో ఉద్యమంలో రామినేని శ్రీనివాసరావు చురుకైన పాత్ర పోషించారు. టీఎన్జీవో యూనియన్‌లో ఎంతోమంది అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు మారినప్పటికీ శ్రీనివాసరావునే కోశాధికారిగా సేవలందిస్తూనే ఉన్నారు. ఎప్పుడూ ముఖంపై బొట్టుతో కనిపించే ఆయన్ను.. తోటి ఉద్యోగులు ముద్దుగా బొట్టు శ్రీను అని పిలుచుకునేవారు. రామినేని శ్రీనివాసరావు మరణం పట్ల పలువురు ఉద్యోగ సంఘాల నేతలు సంతాపం తెలిపారు.
కేసీఆర్ సంతాపం
రామినేని శ్రీనివాసరావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో ఉద్యోగ సంఘాల నేతగా వారి కృషి చిరస్మరణీయమన్నారు. శ్రీనివాసరావు మృతి విచారకరమని పేర్కొన్నారు. ఆయన మృతితో శోకతప్తులైన కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన సానుభూతిని తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని ప్రార్థించారు.