హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా (సీఈవో) బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి వికాస్‌రాజ్‌కు టీఎన్జీవో నేతలు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం మాసాబ్‌ట్యాంక్‌లోని ఆయన కార్యాలయంలో వికాస్‌రాజ్‌ను కలిసి టీఎన్జీవో అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, ప్రధానకార్యదర్శి రాయికంటి ప్రతాప్, నల్లగొండ జిల్లా అధ్యక్షుడు శ్రావణ్ పుష్పగుచ్ఛం అందజేశారు.