హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్‌కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది. మంగళవారం సం ఘం నేతలు సీఎస్ రామకృష్ణారావును సచివాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు.
టీఎన్జీవో అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ఎస్ఎం హుస్సేనీ ముజీబ్, అసోసియేట్ అధ్యక్షుడు కస్తూరి వెంకటేశ్వర్లు, కోశాధికారి ముత్యాల సత్యనారాయణగౌడ్, సిటీ అధ్యక్షుడు కస్తూరి శ్రీకాంత్ వినతిపత్రం సమర్పించిన వారిలో ఉన్నారు.