హైదరాబాద్, జనవరి 21(నమస్తే తెలంగాణ): తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పరీక్షలను మార్చి 29న నిర్వహించనున్నారు. ఉదయం 10గంటల నుంచి ఒంటి గంట వరకు టీఎస్టీ, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 వరకు ఎంఎస్టీ పరీక్షలు జరగనున్నాయని బోర్డు అధికారులు బుధవారం వెల్లడించారు.
అబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు పరీక్షలు ఉంటాయని, హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆయా పోస్టులకు 31 డిసెంబర్ 2025 నుంచి ఈ నెల 20 వరకు దరఖాస్తులు స్వీకరించారు. టీఎంటీకి 20, 097(వుమెన్స్ 6,489), ఎంఎస్టీకి 6,063(వుమెన్స్ 735) దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. గతంలో ఎన్నడూలేని విధంగా పెద్దసంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తు
చేసుకున్నారని తెలిపారు.