హైదరాబాద్, ఫిబ్రవరి 16 (నమస్తే తెలంగాణ): రష్యా- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చి న వైద్య విద్యార్థులకు ఉజ్బెకిస్థాన్ అం డగా నిలిచిందని ఆ దేశ ఆరోగ్యశాఖ మాజీ మంత్రి హెచ్ఈ అలిషర్ కయుమోవిచ్ షడ్మనోవ్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీ (టీఎంఏ)కి చాన్స్‌లర్/రెక్టార్‌గా సేవలు అందిస్తున్నారు. టీఎంఏ దక్షిణాసియా ప్రాంతీయ కార్యాలయాన్ని నియో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సె స్ అండ్ టెక్నాలజీ లిమిటెడ్‌తో కలిసి హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో ప్రారంభించినట్టు గురువారం తెలిపారు. భవిష్యత్తులో టీఎంఏలో చదువాలనుకొనే విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ కా ర్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
టీఎంఏలో ఆధునిక మౌలిక సదుపాయాలు, అదనపు శిక్షణ కోసం నిపుణులైన భారతీయ, అంతర్జాతీయ ప్రొఫెసర్లతో కూడిన అధునాతన మల్టీ స్పెషాలిటీ ప్రభుత్వ దవాఖాన ఉన్నాయ ని వెల్లడించారు. విదేశాల్లో వైద్య విద్య చదువుకోవాలనే మధ్యతరగతి వారికి తక్కువ ఖర్చుతో మెడిసిన్ పూర్తయ్యేలా చూస్తున్నామని చెప్పారు. కార్యక్రమం లో నియో గ్రూప్ డైరెక్టర్ దివ్యరాజ్రెడ్డి, ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయం ఫస్ట్ సెక్రటరీ మహమ్మద్ పాల్గొన్నారు.