TGSRTC | మంత్రి పొన్నం ప్రకటనపై ఆందోళన.. జూన్ 1న ఇందిరాపార్క్ వద్ద దీక్షకు ఆర్టీసీ ఉద్యోగుల పిలుపు
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సామూహిక దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు.
TGSRTC | ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లుగా అపాయింటెడ్ డే ప్రకటించాలని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ (TJMU) నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు జూన్ 1వ తేదీన హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద సామూహిక దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు.
యూనియన్ ఎన్నికలకు ముందుగా ఉద్యోగుల ప్రక్రియ పూర్తి చేయాలని.. 2026 మే 1 నుంచి అపాయింటెడ్ డే ప్రకటించాలని టీజేఎంయూ నాయకులు డిమాండ్ చేశారు. అపాయింటెడ్ డే కంటే ముందుగా యూనియన్ ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రకటించడంతో ఉద్యోగుల్లో అయోమయం నెలకొందని వారు అభిప్రాయపడ్డారు.
జూన్ 1వ తేదీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇందిరాపార్క్ వద్ద దీక్ష నిర్వహించనున్నట్లు టీజేఎంయూ వ్యవస్థాపక రాష్ట్రకార్యదర్శి హనుమంతు ముదిరాజ్ తెలిపారు. ప్రభుత్వంలో విలీనం కోరుకునే ఉద్యోగులంతా యూనియన్లకు అతీతంగా ఈ దీక్షలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ దీక్షకు తెలంగాణ ఆర్టీసీ కార్మిక సమాఖ్య కూడా మద్దతు ప్రకటించింది. యాజమాన్యం వద్ద పరిష్కారం కావాల్సిన 29 సమస్యలపై చర్చలు కొనసాగుతున్న సమయంలో ఎన్నికలకు వెళ్లడం వల్ల కార్మికులు నష్టపోతారని కార్మిక సమాఖ్య నాయకులు కె.రాజిరెడ్డి తెలిపారు. విలీనం అనంతరం యూనియన్లు కొనసాగితే ఎన్నికల అంశాన్ని పరిశీలించాలని పేర్కొన్నారు. విలీనానికి సంబంధించిన విధివిధానాలు రూపొందించే కమిటీలో ప్రతి యూనియన్‌కు ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. అపాయింటెడ్ డే ప్రకటించే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని స్పష్టంచేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fauzi ప్రభాస్ పుట్టినరోజున ‘ఫౌజీ’ టీజర్ రావడం లేదా .. అభిమానులకు మైత్రీ నవీన్ కీలక అప్డేట్!
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

