హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆదివారం ప్రారంభం కానున్నాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలకు శనివారం టీటీడీ అంకురార్పణ చేసింది. ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 19న సాయం త్రం 6:30 గంటలకు శ్రీవారి గరుడోత్సవం ఉంటుంది. ఆదివారం నుంచి ఈ నెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను, ప్రత్యేక దర్శనాలను రద్దు చేశారు.