హైదరాబాద్, సెప్టెంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఇటీవల అనారోగ్యంతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందారు. ఆ పోస్టును ఎవరికి ఇస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్న క్రమం లో.. సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహుర్తం ఖరారు చేసినట్లు ప్రకటించారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సీపీఎం 24వ అఖిలభారత మహాసభలు మధురైలో జరగనున్నాయి. ఈ అఖిలభారత మహాసభల్లో సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి ఎన్నిక ఉంటుందని, కొత్త ప్రధాన కార్యదర్శి ఎన్నిక వరకు పొలిట్‌బ్యూరోకు, సెంట్రల్ కమిటీకి.. సమన్వయకర్తగా ప్రకాశ్‌కారత్ వ్యవహరించనున్నట్లు సీపీఎం వర్గాలు తెలిపాయి.