హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తేతెలంగాణ): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులులు హడలెత్తిస్తున్నాయి. ఒకవైపు మగ పులి, మరోవైపు ఆడపులి తోడు కోసం వందల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ ప్రయాణంలో అడ్డొచ్చిన ఆవులు, ఎద్దులపై దాడి చేసి ఆకలి తీర్చుకుంటున్నాయి. మెటింగ్ సీజన్ కావడం తో ఆ రెండు కలుస్తాయని అటవీశా ఖ అధికారులు భావిస్తున్నారు. మహారాష్ట్ర నుంచి నిర్మల్, బోథ్ సరిహద్దు మండలాల్లోకి ప్రవేశించిన పులి జానీగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత నెల 23న తెలంగాణలోకి ప్రవేశించి ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అడవుల్లో సంచరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు రెండు నెలల క్రితం కుమ్రం భీం జిల్లా కెరమెరి అడవుల్లోకి వచ్చిన ఆడపులి జో డేఘాట్ అడవుల్లో సంచరించింది. ప్రస్తుతం రెండు పులులు సమీపానికి చేరుకున్నట్టు అధికారులు గుర్తించా రు. కేవలం పదుల కిలోమీటర్ల దూ రంలోనే రెండు పులులు సంచరిస్తున్నట్టు తెలిపారు.