హైదరాబాద్, డిసెంబర్30 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇరిగేషన్ గ్రాడ్యుయేట్ ఇంజినీర్స్ అసోసియేషన్(టైగర్స్ అసోసియేషన్) రూపొందించిన 2025 సంవత్సరం డైరీ, క్యాలెండర్‌ను నీటిపారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోమవారం ఆవిషరించారు. ఇంజినీర్లందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. త్వరలోనే అన్ని క్యాడర్లలో పదోన్నతులు కల్పిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో టైగర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నూనె శ్రీధర్, సెక్రటరీ జనరల్ బీ గోపాలకృష్ణారావు, వరింగ్ ప్రెసిడెంట్ వెగ్గళం ప్రకాశ్, అసోసియేట్ ప్రెసిడెంట్ కే సుధాకర్‌రెడ్డి, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాథ్, వైస్ ప్రెసిడెంట్ దొంతి కవిత, వివిధ జిల్లాల ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు పాల్గొన్నారు.