కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముణుగూరులో (Manuguru) పెద్దపులి కలకలం సృష్టించింది. మణుగూరు ఏరియా ఓపెన్‌కాస్ట్ గని-4లో శుక్రవారం తెల్లవారుజామున పెద్దపులి (Tiger) సంచరించింది. పులి సంచరించడాన్ని అక్కడ పనిచేస్తున్న సిబ్బంది గుర్తించారు. దీంతో వెంటనే అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు సింగరేణి ఆఫీసర్లతో కలిసి పులి సంచరించిన ప్రాంతాన్ని పరిశీలించారు. పులా పాదముద్రలను సేకరించారు.
కాగా, గతంలో కూడా మణుగూరు ఓసీలో పెద్దపులి సంచరించింది. గతేడాది డిసెంబర్లో మణుగూరు ఏరియా ఓసీ-2 బొగ్గు గనిలో గురువారం తెల్లవారుజామున పెద్ద పులి సంచరించింది. ఓబీ గుట్ట మీద నుంచి వచ్చిన పెద్ద పులి వాటర్ ఫిల్లింగ్ ప్రాంతం వద్ద దాహార్తిని తీర్చుకొని అడవిలోకి వెళ్లిపోయింది.