Telangana | హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తేతెలంగాణ): రాష్ట్రంలో పులుల సంచారం పెరిగింది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్తోపాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పెరిగిన పులుల సంచారం అక్కడి అటవీ అధికారులు, ప్రజలకు నిద్రలేకుండాచేస్తున్నాయి. పది రోజుల నుంచి లక్షెట్టిపేట మండలం హన్మంతుపల్లి, హాజీపూర్ మండలం ధర్మారం బీట్ పరిధిలో పెద్దపులి సంచరిస్తుందని పాదముద్రల ఆధారంగా అటవీ శాఖ అధికారులు గుర్తించారు.
హాజీపూర్మండలం బుగ్గగుట్ట అటవీ ప్రాంతంలో గత నెల 27న చిరుత పులి గొర్రెలమందపై దాడి చేసి రెండు గొర్రెలను చంపిందని అటవీశాఖ అధికారులు తెలిపారు. మేడారం సెక్షన్లో మేతకు వెళ్లిన ఆవులపై పెద్దపులి దాడి చేసి చంపడం కలకలం రేపింది. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కుచలాపూర్ అటవీశాఖ బిగించిన సీసీ కెమెరాల్లో చిరుత పులి దృశ్యాలు నమోదయ్యాయి. చిరుత సంచారంతో వ్యవసాయ ప నులు చేసుకోలేకపోతున్నామని, అధికారులు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.