ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి కలకలం సృష్టిస్తున్నది. గతకొన్ని రోజులుగా కాగజ్‌నగర్ అటవీ డివిజన్లో సంచరిస్తున్న పులి.. పశువులపై దాడిచేస్తున్నది. వారం రోజుల వ్యవధిలో ఎనిమిది పశువులను చంపి తినేసింది. డివిజన్లో వేంపల్లి, కోసిని, అనుకోడ, అంకుశపూర్ అటవీ ప్రాంతాల్లో పెద్దపులి సంచరిస్తున్నది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు వీలైనంత తొందరగా పులిని పట్టుకోవాలని కోరుతున్నారు.