Asifabad | కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా పెంచికల్పేట్ మండలం ఎల్లూరు అటవీ ప్రాంతంలో పులి మృతిని చాలెంజ్‌గా తీసుకున్న వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బోర్డ్ చెన్నై స్టేట్ విజిలెన్స్ అధికారి జయప్రకాశ్ బృందం ఆధ్వర్యంలో 30మంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.
పులిని హతమార్చింది తామేనని వారు ఒప్పుకోవడంతోపాటు, పులి అవశేషాలను ఎక్కడ దాచింది వెల్లడించినట్టు తెలిసింది. సోమవారం సదరు వేటగాళ్లను తీసుకొచ్చి చిన్నరాస్పల్లిలోని ఓ వ్యక్తి ఇంటి వెనుకాల దాచిపెట్టిన పులి గోర్లు, తల, కాళ్లు, చర్మం స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.