హైదరాబాద్, డిసెంబర్ 14 (నమస్తేతెలంగాణ): గురుకులాల్లో అధ్వాన పరిస్థితులపై బీఆర్ఎస్ కొంతకాలంగా చేస్తున్న పోరాటంతోనే ప్రభుత్వం గురుకులాల బాట పట్టిందని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఒక ప్రకటనలో తెలిపారు. పలువురు గురుకుల విద్యార్థులు మరణించినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని విమర్శించారు.
బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో గురుకులాల్లో సమస్యలను వెలికితీసినా రేవంత్ సర్కారు నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా గురుకులాల్లో మెరుగైన వసతులతోపాటు నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్ చేశారు.