నారాయణపేట : పార్క్ చేసిన కారు అద్దాలు(Car windows) పగులగొట్టి రూ.3లక్షలు గుర్తు తెలియని దుండగులు(Thugs) దోచుకెళ్లిన( Looted) సంఘటన నారాయణపేట(Narayanapet) జిల్లా కేంద్రంలోని చౌక్ బజార్లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కోస్గికి చెందిన వెంకటేష్ అనే వ్యక్తి ఇంటి లోన్ కోసం తీసుకొచ్చిన డబ్బులను కారులో పెట్టి డీడీ తీసుకునేందుకు బ్యాంక్ వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన దొంగలు కార్ డ్రైవింగ్ సీట్ అద్దాలు పగులగొట్టి అందులో రూ.3 లక్షల ఎత్తుకెళ్లారు. బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీపీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేస్తున్నారు.