హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ): ప్రజా ప్రయోజనాల కోసమే రాజకీయాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తుంటారని మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే సంజయ్ వెల్లడించారు. కేటీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని గిఫ్ట్ ఏ స్మైల్‌లో భాగంగా బుధవారం తెలంగాణభవన్‌లో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్ పాటిమీది జగన్మో హన్‌రావు ఆధ్వర్యంలో ఆరుగురు దివ్యాంగులకు త్రిచక్ర వాహనాలు, ఆరుగురు పేద విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు మాజీ ఎంపీ చంద్రశేఖర్‌రెడ్డి, రాష్ట్ర కార్పొరేషన్ మాజీ చైర్మన్లు పల్లె రవి, రామచందర్‌తో కలిసి అందజేశారు. నేతలు ప్రత్యేక రోజుల్లో ఇలాంటి సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు.