హన్వాడ, సెప్టెంబర్ 29 : ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మహబూబ్‌నగర్ జిల్లా హన్వాడ మండలంలోని మూడు తండాలకు చెందిన వారు మద్దతు ప్రకటించారు.
శుక్రవారం పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు ఎర్రగట్టు తండా, బుడమకొండ తండా, డాక్యనాయక్ తండా వాసులు బాసటగా నిలిచారు. కారు గుర్తుకు ఓటేస్తామని ముక్తకంఠంతో ప్రకటించారు. ఈ మేరకు తీర్మాన ప్రతిని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అందజేశారు.