హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ హైకోర్టుకు శాశ్వత న్యాయమూర్తులుగా జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి, జస్టిస్ సుజన శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. వారి తో హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ సుజయ్‌పాల్ ప్రమాణం చేయించారు. 2023 జూలై 31న అదనపు న్యాయమూర్తులుగా బాధ్యతలు చేపట్టిన ఈ ముగ్గురిని శాశ్యత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రపతి జారీచేసిన నియామక ఉత్తర్వులను రిజిస్ట్రార్ జనరల్ ఎస్ గోవర్ధన్‌రెడ్డి చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తు లు, అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వరరావు, బార్‌కౌన్సిల్ చైర్మన్ ఏ నరసింహారెడ్డి, అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ జీ ప్రవీణ్‌కుమార్, హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు.