దేవరకొండ రూరల్, సెప్టెంబర్ 18: మైనార్టీ గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు అదృశ్యమైన ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో జరిగింది. మైనార్టీ గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముజీబ్, తౌఫిక్ఉమర్, అబ్దుల్ రెహమాన్ 16న పాఠశాలకు సెలవు కావడంతో బయటి నుంచి కల్లు తెచ్చుకున్నారు. స్టాఫ్‌నర్స్ జ్యోతి ప్రిన్సిపాల్ అశోక్‌కు తెలపడంతో భయపడిన విద్యార్థులు మంగళవారం ప్రహ రీ దూకి పారిపోయారు. పెట్టెలను వెతకగా ‘మమ్మల్ని పాఠశాలలో టార్చర్ పెడుతున్నారు.. అందుకే పారిపోతున్నాం.. మా కోసం ఎవరూ వెతకొద్దు’ అని రాసి ఉన్న లెటర్ లభించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 18(నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్ టీచర్లకు పదోన్నతులు కల్పించాలని తెలంగాణ మాడల్ స్కూల్స్ టీచర్స్ అసొసియేషన్ (టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. పరస్పర బదిలీలకు అవకాశం కల్పించి, ఖాళీలున్న చోటికి బదిలీ చేయాలని విజ్ఞప్తిచేసింది. అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు నేతృత్వంలోని ప్రతినిధి బృందం బుధవారం విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను సచివాలయంలో కలిసి వినతిపత్రాన్ని సమర్పించింది. బదిలీలపై ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది.