హైదరాబాద్: ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాకు చెందిన ముగ్గురు మృతిచెందారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఇరిగేషన్ డీఈ వెంకటరామిరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లారు. పుణ్యస్నానం ఆచరించి కారులో తిరుగు ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో వారణాసి వద్ద వారు ప్రయాణిస్తున్న కారు టిప్పర్ను ఢీకొట్టింది.
దీంతో తీవ్రంగా గాయపడిన వెకంటరామి రెడ్డి, ఆయన సతీమణి విలాసిని, కారు డ్రైవర్ న్యాల్కల్ మండలానికి చెందిన మల్లారెడ్డి అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు వారిని సమీపంలోని దవాఖానకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉన్నది.