హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మరో మూడు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు అటానమస్ హోదాను దక్కించుకొన్నాయి. న్యాక్-ఏ గ్రేడ్ గుర్తింపు పొందిన ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కామారెడ్డి), ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ (నల్లగొండ), ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (నర్సంపేట)కు యూజీసీ అటానమస్ హోదా కల్పించగా, అటానమస్ కాలేజీల సంఖ్య 14కు చేరింది.