ACB Raids | చర్లపలి/మణికొండ, రంగారెడ్డి మే 31 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రా ంతాల్లో ఏసీబీ దాడులు తీవ్రతరం చేసింది. నీటిపారుదల, రెవెన్యూ, పోలీసు, విద్యుత్తు శా ఖల్లోని అవినీతి చేపల వ్యవహారంపై వేట మొదలుపెట్టింది. దాడుల్లో తొమ్మిది మంది ప్రభుత్వ ఉద్యోగులను, మరొకరిని అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా రెడ్‌హిల్స్ నీటిపారుదల శాఖ కార్యాలయంలో గురువారం రాత్రి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అక్కడ నలుగురు ప్రభుత్వ ఉద్యోగులుండగా, ముగ్గురు పట్టుబడ్డారు. సర్వేయర్ పరారుకావడంతో అతన్ని కూడా పట్టుకొన్నారు. వివరాల్లోకెళ్తే.. రంగారెడ్డి జిల్లా మణికొండలోని నెక్నాన్పూర్లో భవన నిర్మాణానికి, ఇరిగేషన్ అనుమతుల కోసం బాధితుడు బొమ్మ ఉపేంద్రనాథ్‌రెడ్డి దరఖాస్తు చేసుకొన్నాడు. అతడికి ఎన్వోసీ ఇవ్వడానికి ఇరిగేషన్ ఎగ్టిక్యూటివ్ ఇంజినీర్ భన్సీలాల్, అసిస్టెంట్ ఇంజినీర్ కే కార్తీక్, మరో సెక్షన్ ఏఈ నికేశ్‌కుమార్ రూ. 2.5 లక్ష లు డిమాండ్ చేశారు. రూ.1.5 లక్షలు ముం దుగానే తీసుకొన్నారు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఇరిగేషన్ కార్యాలయంలో ఈ ముగ్గురికి బాధితుడు మరో రూ.లక్ష ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. అక్కడే ఉన్న గండిపేట సర్వేయర్ పీ గణేశ్ కూడా సర్వే చేసేందుకు బాధితుడి వద్ద రూ.40 వేల లంచం తీసుకొంటుండగా పట్టుబడ్డారు. నలుగురిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.

కొత్తకోట మండలం నిర్విన్‌కు చెందిన కాంట్రాక్టర్ ఎన్ ప్రవీణ్, లక్ష్మీనారాయణకు చెందిన రెస్టారెంట్ వద్ద ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించి రూ.2,11,421 బిల్ చేయడానికి విద్యుత్ శాఖ ఎస్ఈ పీవీ నాగేంద్రకుమార్, డీఈ నరేందర్, ఏఈ మధుకర్‌ను కాంట్రాక్టర్ సంప్రదించాడు. బిల్లు చేసేందుకు రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయగా.. రూ.19 వేలకు ఒప్పుకొన్నాడు. బాధితుడు ప్రవీణ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. శుక్రవారం రాత్రి ప్రవీణ్ వనపర్తి ఎస్ఈ కార్యాలయంలో ఈ ముగ్గురికి మొత్తం డబ్బును చెల్లిస్తుండగా, రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొన్నారు. తర్వాత నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడకు చెందిన సింగిరెడ్డి భరత్‌రెడ్డిపై భూ తగాదా విషయంలో కేసు నమోదైంది. ఈ కేసులో పూర్తిగా సహకరించేందుకు రూ. 3 లక్షలు లంచం ఇవ్వాలంటూ బాధితుడిని కుషాయిగూడ ఎస్సై షేక్ షఫీ, ఇన్స్పెక్టర్ వీరస్వామి డిమాండ్ చేశారు. లంచం డిమాండ్ చేస్తున్నారంటూ బాధితుడు భరత్‌రెడ్డి ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం బాధితుడు రూ. 3 లక్షల లంచాన్ని మధ్యవర్తి ఉపేందర్ ద్వారా ఎస్సై షేక్షఫీకి ఇస్తుండగా, ఏసీబీ అధికారులు పట్టుకొన్నారు. దీంతో ఎస్సై, మధ్యవర్తి ఉపేందర్‌ను అరెస్టు చేశారు. విచారణలో ఇన్స్పెక్టర్ వీరాస్వామి కి కూడా వాటా ఉందని తేలడంతో అతనిని కూడా అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు.