ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టుల మృతి
రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు, జవాన్లకు మరోసారి జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు సమాచారం.
- ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఎదురుకాల్పులు
కొత్తగూడెం క్రైం, డిసెంబర్ 24 : రాష్ట్ర సరిహద్దు ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో ఆదివారం మావోయిస్టులు, జవాన్లకు మరోసారి జరిగిన భీకర పోరులో ముగ్గురు మావోయిస్టులు మరణించినట్టు సమాచారం. ఛత్తీస్గఢ్ రాష్ట్రం సుక్మా-దంతెవాడ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు పార్టీ కటేకళ్యాణ్ ఏరియా కమిటీ ఉన్నదని పోలీసులకు విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో దంతెవాడ డీఆర్జీ భద్రతా దళాలు డబ్బా కున్ను అడవుల్లో మావోయిస్టులు ఉన్న ప్రాంతంలోకి ప్రవేశించాయి.
జవాన్లను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగారు. అప్రమత్తమైన జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు. ఇరువర్గాల మధ్య సుమారు 30 నిమిషాలపాటు భీకరపోరు జరిగినట్టు తెలుస్తున్నది. జవాన్ల ధాటికి తాళలేని మావోయిస్టులు ఆ ప్రాంతం నుంచి పారిపోయారు. కాల్పుల విరమణ తర్వాత ఘటనా స్థలాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్న జవాన్లు గాలింపు చర్యలు చేపట్టగా, ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభించినట్టు తెలిసింది. వారికి సంబంధించిన ఆయుధ, వస్తు సామగ్రిని సైతం భద్రతా దళాలు స్వాధీనపరుచుకున్నట్టు సమాచారం. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

