హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్లో నాయకుల మధ్య వివాదాలను పరిష్కరించేందు కు త్రీమెన్ కమిటీలను ఏర్పాటు చేస్తామని టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మ న్, ఎంపీ మల్లు రవి పేర్కొన్నారు. క్రమశిక్షణ పేరుతో పార్టీ నుంచి నాయకులను సస్పెండ్ చేయడం కంటే వారి సమస్యను పరిష్కరించడంపై దృష్టి సారిస్తామని తెలిపారు.
గాంధీభవన్లో గురువారం కొత్త పీసీసీ క్రమ శిక్షణ కమిటీ తొలి సమావేశం మల్లు రవి అధ్యక్షతన జరిగింది.