Road Accident | సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. బైక్‌ని లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కోదాడ-జడ్చర్ల 167 నంబర్ జాతీయ రహదారిపై చిలుకూరు మండలం మీట్స్ కళాశాల పరిధిలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ముగ్గురు బైక్‌పై మిర్యాలగూడ నుంచి కోదాడకు వస్తుండగా లారీ ఢీకొట్టింది. మృతులను మిర్యాలగూడెం నియోజకవర్గం వేములపల్లికి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.