ఆటోపై గ్రానైట్ రాళ్లుపడి ముగ్గురు దుర్మరణం
road accident | మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే
Road Accident | మహబూబాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకున్నది. కురవి వద్ద జాతీయ రహదారిపై ఆటోపై గ్రానైట్ లారీపై నుంచి బండరాళ్లపడిపోయాయి. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయం బండరాళ్లను రోడ్డుపై నుంచి తొలగించి, ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.
మృతులను మంగోరిగూడెంకు చెందిన వారిగా గుర్తించారు. లారీ గ్రానైట్ లోడ్తో వెళ్తుండగా.. వాటికి కట్టిన తాళ్లు ఊడిపోయాయి.. పక్క నుంచి వెళ్తున్న ఆటోపై పడిపోయాయని స్థానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆటోలు ఏడుగురు వ్యక్తులు ఉండగా.. ముగ్గురు వ్యక్తులు ఆటోలో చిక్కుకొని మృతి చెందారు. భారీ బండరాళ్లు కావడంతో మృతదేహాలు నుజ్జునుజ్జయ్యాయి. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి కాళ్లు, చేతులు విరిగాయి.
ఇందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అయితే, మితిమీరిన వేగం, సరిగా రాళ్లను కట్టకపోవడంతో ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. లారీ మహబూబాబాద్ నుంచి మరిపాడు వెళ్తుండగా ప్రమాదం చోటు దుర్ఘటన చోటు చేసుకున్నది. క్రేన్ సహాయంతో బండరాళ్లను తొలగించి మృతదేహాలను ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. గాయపడ్డ నలుగురికి మహబూబాబాద్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న, ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

