మేడిపల్లి, డిసెంబర్ 5: పెండ్లి వస్ర్తాలు కొనుగోలు చేసి తిరిగి ఇంటికి వస్తున్న వారి కారును బస్సు ఢీకొనడంతో ముగ్గురు దుర్మరణం చెందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం మోహన్‌రావుపేట వద్ద జరిగింది. కోరుట్ల పట్టణానికి చెందిన ఎండీ నుస్రత్అలీ రెండో కొడుకు ఫుర్ఖాన్ వివాహం ఈనెల 29న జరగాల్సి ఉన్నది. పెండ్లి వస్ర్తాలు కొనేందుకు ఫుర్ఖాన్ సోదరి సుమయ అమ్రీన్, బావ జావీద్ బిన్ సులేమాన్, అల్లుళ్ల్లు మహ్మ ద్ అనాస్, అషార్, అజాన్, డ్రైవర్ మహ్మద్ సాజీద్‌అలీ ఆదివారం కారులో హైదరాబాద్ వెళ్లారు. షాపింగ్ పూర్తిచేసుకొని తిరిగి వస్తున్నారు. పదిహేను నిమిషాల్లో ఇంటికి చేరుకోవాల్సి ఉండగా.. మోహన్‌రావుపేట బ్రిడ్జి వద్ద వీరి కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు డ్రైవర్ సాజీద్ అలీ(32)తోపాటు అజాన్(5) అక్కడికక్కడే మృతి చెందా రు. క్షతగాత్రులను దవాఖానకు తరలిస్తుండగా అషార్(9) మరణించాడు. కాగా బస్సు లోని 17 మందితోపాటు, కారులో ఉన్న మరో ఇద్దరు గాయపడ్డారు.