Gold scheme | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 21 (నమస్తే తెలంగాణ): తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ పలువురి నుంచి రూ. 4 కోట్లు వసూలు చేసిన ముగ్గురు స్నేహితులపై సీసీఎస్‌లో కేసు నమోదైంది. విశాల్, వినయ్, అఖిల్ ముగ్గురు స్నేహితులు కలిసి తక్కువ ధరకు బంగారం ఇప్సిప్తామంటూ గోల్డ్‌స్కీమ్ ఏర్పాటు చేశారు. ఇందులో రూ. 50 వేలతో చేరితో బంగారం మార్కెట్ రేట్ కన్నా 10 శాతం తక్కువకు వస్తుందంటూ డిపాజిట్లు సేకరించారు. ఆ తరువాత దీనిని చైన్ సిస్టమ్‌లా మార్చేశారు. మొదటి గోల్డ్‌స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన వాళ్లకు లాభం వచ్చిందంటూ నమ్మిస్తూ కొంత డబ్బులు తిరిగి ఇస్తూ నమ్మకం కుదుర్చుకున్నారు. దీంతో చాల మంది స్కీమ్‌లో చేరగా రూ. 4 కోట్ల వరకు వసూలు చేసి పరారయ్యారు. రామంతాపూర్‌కు చెందిన బాధితులు సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.