హనుమకొండ : జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలి ముగ్గురు మృతి చెందారు. ఈ విషాదకర సంఘటన శాయంపేట మండల కేంద్రంలో శుక్రవారం చోటు చేసుకుంది. మండల కేంద్రానికి చెందిన మోర పెద్ద సాంబయ్య, లోకపోయిన సారమ్మ, భోగి జోగమ్మ మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
వివరాలు సేకరిస్తున్న పోలీసులు