భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. భువనగిరి మండలం హన్మాపురం వద్ద వేగంగా దూసుకొచ్చిన డీసీఎం అదుపుతప్పి బైకును ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, పురుషుడు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోఘటనలో షాద్నగర్ బైపాస్ రోడ్డులో కారు, బైకు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తి మరణించాడు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతుని వివరాలు తెలియాల్సి ఉన్నది.