రంగారెడ్డి: హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై (ORR)ప్రమాదం జరిగింది. ఓఆర్ఆర్పై రావిరాల వద్ద ఆగిఉన్న లారీని ట్రక్కు ఢీకొట్టింది. దీంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.