ఆదిలాబాద్, అక్టోబర్ 1 (నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ పట్టణంలోని ఖానాపూర్ చెరువు పరిసరాల్లో మూడ్రోజుల తర్వాత మంగళవారం అధికారులు మళ్లీ సర్వే చేయడానికి వచ్చారు. సర్వే బృందాలు పోలీసులతో కలిసి రాగా స్థానికులు వారిని అడ్డుకున్నారు.
ఏండ్లు గా తాము ఇక్కడ నివాసం ఉంటున్నామని, ఎట్టి పరిస్థితుల్లో సర్వేను జరగనివ్వబోమని వారు స్పష్టం చేశారు. దీంతో అధికారులు చేసేదేమీ లేక వెనుదిరిగారు.
పేదల జోలికొస్తే ఊరుకోం: కూనంనేని
సుబేదారి, అక్టోబర్1: హైడ్రా పేరు తో హైదరాబాద్లో పేదల ఇండ్లను కూల్చడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని, పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. హనుమకొండ బాలసముద్రంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను ఏర్పాటు చేసి హైదరాబాద్లో తొలుత ఎన్ కన్వెన్షన్ కూల్చివేయడంతో ప్రజల్లో మంచిపేరు వచ్చిందని తెలిపారు.