ఆదిలాబాద్, ఆగస్టు 27 ( నమస్తే తెలంగాణ) : చేపలవేటకు వెళ్లిన మహారాష్ట్రకు చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో జరిగింది. మహారాష్ట్ర నాందెడ్ జిల్లా నవీ అబాదికి చెందిన నాగుల్ వాడే విజయ్ (28), నాగుల్ వాడే ఆకాశ్ (26), నాగుల్ వాడే అక్షయ్ ( 24) తాంసి మండలం బండల్‌నాగాపూర్‌లో వారి బంధువు శ్రీనివాస్ ఇంటికి వచ్చారు. మంగళవారం ఈ ముగ్గురు చేపలవేట కోసం ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చర వాగులోకి వెళ్లారు. వాగులో దిగి చీరతో చేపలు పడుతుండగా లోతు తెలియకపోవడంతో అక్షయ్ వాగులో మునిగిపోయాడు. అతడిని కాపాడేందుకు ఆకాశ్, విజయ్ ప్రయత్నించగా వారు సైతం నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు డీడీఆర్ఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని 5 గంటలపాటు శ్రమించి ముగ్గురు యువకుల మృతదేహాలను వెలికితీశారు. పోస్టుమార్టం కోసం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు.