రాష్ట్రంలో యువతులు, బాలికలపై వరుసగా జరుగుతున్న లైంగికదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రేమిస్తున్నానని, పెండ్లి చేసుకుంటానని, స్నేహితులమని చెబుతూ నమ్మించి వంచిస్తున్నారు కామాంధులు. ఆశ్రయం కోసం ఎదురుచూస్తున్న అభంశుభం తెలియని బాలికలను లొంగదీసుకొని అఘాయిత్యానికి పాల్పడ్డారు.
Telangana | మన్సూరాబాద్, అక్టోబర్ 4 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్‌కు చెందిన ఎం సాయికుమార్ నాగోల్‌లోని ఓ హోటల్లో బౌన్సర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడే సీనియర్ కెప్టెన్‌గా పనిచేసే ఓ యువతితో సాయికుమార్‌కు పరిచయం ఏర్పడింది. ప్రేమిస్తున్నానంటూ, పెండ్లి చేసుకుంటానని ప్రాధేయపడటంతో అతని మాటలు నమ్మింది. ఈ క్రమంలో ఎల్బీనగర్లోని ఓ హోటల్‌కు తీసుకెళ్లి ఆమెపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. పెండ్లి చేసుకోవాలని ఆమె బలవంతం చేయడంతో తల్లిదండ్రులతో మాట్లాడి ఏప్రిల్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. నెలలు గడుస్తుండడంతో పెండ్లి చేసుకోవాలని ఒత్తి డి తీసుకురాగా యువతిపై దాడి చేసి భయపెట్టాడు. దీంతో మోసపోయినట్టు గ్రహించిన యువతి సాయికుమార్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
జనగామ చౌరస్తా, అక్టోబర్ 4: జనగామ జిల్లా దేవరుప్పుల మండలానికి చెందిన ఓ బాలిక(14)తోపాటు మల్కాజిగిరి చెందిన మరో బాలిక (15) ఐఎస్ సదన్ డివిజన్లో ఉన్న పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్నారు. సెప్టెంబర్ 24న అక్కడి నుంచి బాలికలిద్దరూ పారిపోయి జనగామకు వచ్చారు. రాత్రి కావడంతో బస్టాండ్ సమీపంలో ఉన్న పాన్‌షాప్ నిర్వాహకుడి దగ్గర ఫోన్ తీసుకొని పరిచయం ఉన్న మరో యువకుడికి ఫోన్ చేశారు.
బస్టాండ్‌కు చేరుకున్న ఆ యువకుడు జిల్లాకు చెందిన బాలికను వెంట తీసుకెళ్లి లైంగిక దాడి చేయగా, బస్టాండ్ దగ్గర ఉన్న మరో బాలికకు ఆశ్రయం కల్పిస్తానని నమ్మబలికిన పాన్‌షాప్ నిర్వాహకుడితోపాటు అతడి ముగ్గురు స్నేహితులు లైంగికదాడికి పాల్పడినట్టు సమాచారం. మరుసటి రోజు రాత్రి బస్టాండ్ దగ్గర ఒంటరిగా తిరుగుతున్న బాలికల్ని గుర్తించిన జనగామ అర్బన్ పోలీసులు వారిని చేరదీసి విషయం తెలుసుకున్నారు. ఐదుగురు యువకులు కలిసి బాలికలపై లైంగిక దాడికి పాల్పడ్డారన్న విషయం తెలుసుకొని నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు.
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన తాటి శివరాజ్‌కుమార్ అలియాస్ జెట్టి వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నెపల్లిలోని బిట్స్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతున్నాడు. శివరాజ్‌కుమార్‌కు భూపాలపల్లిలో తన స్నేహితుడు పుట్టపాక శరత్ ద్వారా మూడేండ్ల క్రితం ఖిలా వరంగల్ మండలం బొల్లికుంటలోని ఓ కళాశాలలో చదువుతున్న యువతి పరిచయమైంది. కొన్ని రోజుల తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పగా ఆమె నిరాకరించి ఫ్రెండ్స్‌గా ఉందామని చెప్పింది. శివరాజ్‌కుమార్, తన స్నేహితులు వివేక్, మణిదీప్లతో కలిసి కారులో ఆమె చదువుకుంటున్న కళాశాలకు చేరుకున్నారు.
మాయమాటలు చెప్పి ఆమెను బయటికి రప్పించి.. బలవంతంగా కారులో తీసుకెళ్లారు. వరంగల్ బస్టాండ్ సమీపంలో ఉన్న క్రిస్టల్ ఒయో లాడ్జీకి తీసుకెళ్లి ముగ్గురు కలిసి లైంగిక దాడి చేశారు. కళాశాలలో తెలిస్తే పరీక్షలు రాయనీయరని భయపడి ఎవరికీ చెప్పలేదు. పరీక్షల అనంతరం తల్లికి చెప్పడంతో ఇంతెజర్గంజ్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. గురువారం సాయంత్రం ముగ్గురు నిం దితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.