Kodangal | నారాయణపేట, నవంబర్ 21 : ‘రేవంతన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాసే కొడంగల్ మీడియాకు ఇబ్బందులు తప్పవు.. ఇందుకు మీరే బాధ్యులు.. ఫార్మా కంపెనీ వీడియోలు మీకు అవసరమా?’ అంటూ అజ్ఞాత వ్యక్తి నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన ఓ యూట్యూబ్ చానల్ రిపోర్టకు బెదరింపు లేఖ రాశాడు.
ఈ విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కోస్గి రిపోర్టర్‌గా కొనసాగుతున్న సదరు వ్యక్తి పట్టణంలోని ఓ హోటల్ వద్ద ద్విచక్ర వాహనాన్ని నిలిపిన సమయంలో ఎవరో అం దులో లేఖను వదిలివెళ్లారు. బైక్ ట్యాంకు కవర్‌ను తెరిచి చూడగా అందులో లేఖ కనిపించింది.