కొడంగల్, ఫిబ్రవరి 12 : చిలుకూరు బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు రంగరాజన్‌పై దాడి చేసిన దుండగులను శిక్షించాలని దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ డిమాండ్ చేశారు. బుధవారం ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, అర్చకులు రంగరాజన్‌ను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా వాసుదేవశర్మ మాట్లాడుతూ ఈ ఘటనకు పాల్పడిన దుండగులను వెంటనే శిక్షించాలని కోరారు.
మొయినాబాద్, ఫిబ్రవరి 12 : చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనలో పోలీసులు ఇప్పటికే ఆరుగురు నిందితులను అరెస్టు చేశారు. బుధవారం వరంగల్‌లో ఒకరిని, భద్రాచలంలో ఇద్దరిని, ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళంలో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇప్పటివరకు మొత్తం 14 మందిని అరెస్టు చేయడంతోపాటు రెండు కార్లను సీజ్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు.